Saturday, November 9, 2024

AP-TET | అభ్యంతరం ఉంటే.. 9లోపు చెప్పాలి

అమరావతి, ఆంధ్రప్రభ:ఇంగ్లీష్‌, హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ భాషోపాధ్యాయుల (ఎస్‌ఏ) కొరకు ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచినట్లు ఏపీటెట్‌ కన్వీనర్‌ ఎం.వి. కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే 9వ తేదీలోగా తెలియజేయాలన్నారు.

అభ్యర్థులు తమ అభ్యంతరాలను వెబ్సైట్‌ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. భాగంగా ఐదో రోజు జరిగిన సెకండరీ గ్రేడ్‌ (ఎస్జీటీ) పరీక్షలలో మొత్తం 32875మందికి గాను 28267 (85.98) మంది హాజరయ్యారు. ఉదయం 69 సెంటర్లలో జరిగిన పరీక్షకు 16525 మందికి 14042 మంది (84.97) హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 68 సెంటర్లలో జరిగిన పరీక్షలకు 16350 మందికి 14231 ( 87.04) హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement