Saturday, November 27, 2021

LED దీపాలను వెంటనే అమర్చండి: మున్సిపల్ చైర్ పర్సన్

ఇచ్ఛాపురం ( ప్రభ న్యూస్ ): ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అవసరమైన చోట ఎల్ఈడీ దీపాలు వెంటనే అమలు చేయాలని మునిసిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మి అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘంలో కొత్తగా వచ్చిన 350 LED దీపాలను మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి, అసిస్టెంట్ ఇంజినీర్ కేదారి నాధ్, శివతో కలసి ఆమె పరిశీలించారు. ఈ సంరద్భంగా ఛైర్ పర్సన్ రాజలక్ష్మి మాట్లాడుతూ.. పురపాలక సంఘంలో అవసరం అయిన ప్రదేశాలలో వెంటనే అమార్చాలన్నారు. కొత్త స్తంభాల వద్ద అమర్చినపుడు అవసరమైన వైరింగ్, ఇతర సామగ్రి కోసం కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలన్నారు. దీపాలు అమర్చిన అనంతరం దొంగతనంకి గురైతే కఠిన చర్యలు తీసుకుంతున్నామని హెచ్చరించారు. దొంగతనాలపై ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News