Thursday, April 25, 2024

మాకేం విన‌ప‌డ‌లేదు సార్.. కొన‌సాగుతున్న బెనిఫిట్ షోలు..

ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సినిమాల ప్రదర్శన, ధియేటర్లలో రేట్ల వసూలుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొత్త సినిమాలు విడుదలైందంటే చాలు..తొలి వారం ఒక రేటు, రెండో వారం నుంచి మరో రేటు..ఇలా సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్‌ ఆధారంగా రేట్లు పెంచుకోవడం జరుగుతోంది. హీరోల స్థాయిని బట్టి రేట్లు మారుతుంటాయి. ఇక బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు ఎవరి ఇష్టం వారిదే. వీటన్నింటిపై దృష్టిసారించిన ఏపీ ప్రభుత్వం సినిమాల ప్రదర్శన, రేట్ల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించి చట్ట సవరణలు కూడా చేసింది. కొత్త సినిమాల విడుదల సమయంలో ఇష్టం వచ్చినట్లు షోలు వేసేందుకు..ఇబ్బడి ముబ్బడిగా రేట్లు వసూలు చేసేందుకు అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది.

కొత్త సిని మాల విడుదలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అదనపు షోలు, బెనిఫిట్‌ షోలు వేసినట్లు ప్రేక్షకులు ఆరోపించారు. కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర ధియేటర్‌లో బెనిఫిట్‌షోలు వేసినట్లు పేర్కొంటూ రెవిన్యూ అధికారులు ధియేటర్‌ను సీజ్‌ చేశారు. ఇదే తరహాలో అన్నిప్రాంతాల్లోను బెనిఫిట్‌ షోలు వేసినట్లు చెపుతున్నారు. కొన్ని చోట్ల అదనపు షోలు కూడా నడిచినట్లు తెలుస్తోంది. మరి ఆదేశాల బేఖాతర్ పై ప్రభుత్వం ఏ విధంగాస్పం దిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement