Tuesday, May 30, 2023

నేను బీసీ.. నా భర్త బీసీ.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో వైసీపీ నిర్వహించనున్న బీసీ మహాసభకి సంబంధించిన పోస్టర్ ని నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి రోజా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..తన భర్త సెల్వమణి బీసీ సామాజికవర్గానికి చెందినవారని… తాను బీసీ ఇంటి కోడలినని చెప్పారు. బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె విమర్శించారు. బీసీలను వెనుకబడినవారిగా కాకుండా… రాష్ట్రానికే వెన్నెముకగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్ దని అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు. విజయవాడలో నిర్వహించే బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. బీసీలను ఓటు బ్యాంకుగా భావించే చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement