Monday, October 7, 2024

AP: పిడుగుపాటుకు భార్యాభర్తల మృతి..

కుమారుడికి తీవ్ర గాయాలు
అనంతపురం ఆస్పత్రికి తరలింపు
గంగంపల్లి తండాలో విషాద ఛాయలు


శ్రీ సత్యసాయి బ్యూరో, సెప్టెంబర్ 29 (ప్రభ న్యూస్) : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో ఆదివారం ఉదయం పిడుగు పడి భార్యాభర్తలు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

పిడుగు పడి దాసరి నాయక్ (57) దేవి భాయ్ (48) అనే భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. వీరి కుమారుడు జగదీష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు మృతిచెందగా, వారి కొడుకు తీవ్రంగా గాయపడటంతో గంగంపల్లి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement