Wednesday, March 27, 2024

ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి.. వాణిజ్యశాఖ కళ్లుగప్పి అక్ర‌మ‌ దిగుమతులు..

ఒంగోలు, ప్రభన్యూస్ : జిల్లాలో పెద్ద ఎత్తున రెడీమెడ్‌ దుస్తుల వ్యాపారం సాగుతోంది. ఏ బ‌జారులో చూసినా ఫ్యాషన్‌ రెడీమెడ్‌ దుస్తుల షాపులే కనిపిస్తున్నాయి. కోల్‌కత్తా, జబుల్‌పూర్‌, హౌరా,షాలిమార్‌ తదితర ప్రాంతాల నుంచి రెడీమేడ్‌ దుస్తులు రైళ్లల్లో, ప్రై వేటు ట్రావెల్స్‌లలో గుట్టుచప్పుడు కాకుండా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యశాఖ అధికారులు నిఘా ఉంచినా.. తమకు అనుకూలంగా ఉన్న చోట సరుకును దించుకుంటూ..వారికి దొరకకుండా పోతున్నారు. నిత్యం సరుకు అక్రమ రవాణా చేసే వ్యాపారులు తమ రవాణా అవసరాల కోసం రైళ్లను వినియోగించుకుంటున్నారు. బోగీలలో ఉండే సరుకులనే ఉద్దేశ్యంతో రైల్వే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. నిఘా అధికారులకు దొరకకుండా వారికి వీలుగా దుస్తులను రవాణా చేసుకుంటున్నారు.

ఇలా.. వ్యాపారులు ప‌న్నుల్లు చెల్లించకుండా రూ.లక్షల రూపాయలు విలువ చేసే సరుకును వాణిజ్య పన్నులశాఖ అధికారులకు చిక్కకుండా తరలించేస్తున్నారు. అంతే కాదు వ్యాపారులు తమ రూటును మార్చి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల ద్వారా కూడా రూ.లక్షల విలువైన సరుకును తరలిస్తున్నారు. ఇలా సాగుతున్న వ్యాపారం జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్నా..వాణిజ్యపన్నులశాఖ దృష్టి సారించిన దాఖలాలు లేవు.

జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జీరో వ్యాపారం పెరిగినట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రం నుంచి ఏ సరుకు వస్తోందో నిఘా వ్యవస్థ అయిన చెక్‌పోస్టులను ఎత్తివేయడం, మొబైల్‌ తనిఖీలు కూడా చేపట్టకపోవడంతో లక్షల విలువైన సరుకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలివెళుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం చేజారుతున్నా..పన్నులశాఖలో కదలిక రావడం లేదు. కొత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చిన తరువాత వ్యాపారుల పట్ల కొంత సానుకూల దృక్పథాన్ని కనబర్చాలని జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో కేంద్రం చిన్న సూచన చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఉన్నతాధికారులు ఓ రకంగా నిద్రావస్థకు చేరారనే విమర్శలు వస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement