Wednesday, October 9, 2024

AP | దంచికొడుదున్న ఎండలు.. తూగోజిల్లా దేవరపల్లిలో 44.9 డిగ్రీలు నమోదు

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో ఎండ వేడి, వడగాల్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం నుంచి ప్రచండభానుడి ప్రతాపం పెరిగింది. శనివారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లెలో 44.9, తిరుపతి జిల్లా గూడూరు లో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 44.5 అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఆదివారం ఎండ, వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అల్లూరి 3, బాపట్ల 1, తూర్పుగోదావరి 11, ఏలూరు 5, గుంటూరు 15, కాకినాడ 8, కృష్ణా 9, ఎన్టీఆర్‌ 10, పల్నాడు 5, మన్యం4, వైయస్సార్‌ జిల్లాలోని 2 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, సత్యసాయి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణసంస్థ పేర్కొంది. పిడుగుపాటు- వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement