Wednesday, March 27, 2024

AP Cabinet Sworn: సచివాలయం వద్ద హై సెక్యూరిటీ

అమరావతి సచివాలయం వద్ద ఈ రోజు ఉ.11.31 గం.లకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకరం నేపథ్యంలో అసెంబ్లీ, సచివాలయ ప్రాంతాల్లో పోలీసులు హై సెక్యూరిటీని అలర్ట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో మంత్రులుగా ఎంపికైన వారిని సోమవారం ఉదయం గవర్నర్ చేతులమీదగా ప్రమాణం చేయించనున్నారు.ఈమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రొటోకాల్ విభాగంతోపాటు వివిధ శాఖల అధికారులు సభా వేదిక వద్ద పెద్దఎత్తున్న చేపట్టిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసుశాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి, గవర్నర్‌ మంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ, గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు ప్రమాణస్వీకారానికి హజరయ్యే వారి కోసం ప్రత్యేక పాస్‌లను అధికారులు జారీ చేశారు. మొత్తం నాలుగు క్యాటగిరీల్లో పాస్‌లను జారీ చేశారు. ప్రమాణస్వీకారం చేసే మంత్రుల తాలూకా కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. పొలిటికల్‌ సెక్రటరీ ముత్యాల రాజు, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ కన్వీనర్‌, ఎంఎల్‌సీ పలశిల రఘురాం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

ఇప్పటికే సభా వేదిక, ప్రముఖులు,మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి కుటుంబ సభ్యులు,అఖిల భారత సర్వీసుల అధికారులు,మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా వేరువేరు గేలరీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మంత్రులుగా ఎంపికైన వారిని ఒక్కొక్కరినీ సభా వేదికపైకి ఆహ్వానించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదగా ప్రమాణం చేయిస్తారు.ఈప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణంలో ప్రత్యేక ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement