Friday, February 3, 2023

ముంచుకొస్తున్న తుపాన్‌.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: తుపాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్‌ను ఆనుకుని అల్పపీడనం మరింత బలపడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. బుధవారం సాయంత్రానికి తుపాన్‌గా బలపడనున్న వాయుగుండం గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరకుంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 8 నుంచి 48 గంటలు ఉత్తర తమిళనాడు – దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు ఆనుకుని తుపాన్‌ కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
   

దీని ప్రభావంతో ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు- దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

అప్రమత్తం

తుపాన్‌ ప్రభావిత జిల్లాల యంత్రాగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ తెలిపారు. దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement