Saturday, June 3, 2023

అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని సమాచారం.

యాదమరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమరరాజా ఉద్యోగులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement