Sunday, April 11, 2021

ఎపిలో కొన‌సాగుతున్న జ‌డ్పీటిసి, ఎంపిటిసి పోలింగ్….

అమ‌రావ‌తి – ఎపిలో జ‌డ్పీటిసి, ఎంపిటిసి స్థానాల‌కు పోలింగ్ చెదురుముదురు సంఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది.. నేటి ఉద‌యం 7 గంట‌ల‌కు పోలీంగ్ ఆయా పోలింగ్ కేంద్రాల‌లో ప్రారంభమైంది.. ఉద‌య నుంచే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు పోటెత్తారు.. ఒక వైపు ఎండ‌లు, మ‌రోవైపు వ్య‌వ‌సాయ సీజ‌న్ కావ‌డంతో ఉద‌యాన్నే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు గ్రామీణులు ఆస‌క్తి చూపారు.. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.. ఆ త‌ర్వాత 1 గంట క‌రోనా బాధితులు ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు…. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే పొలింగ్ కొన‌సాగ‌నుంది. కాగా, జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 38 జడ్పీటీసీ, 601 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 494 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖ జిల్లాలో 38 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు, తూర్పు గోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1004 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జడ్పీటీసీ, 790 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 44 జడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరు జిల్లాలో 46 జడ్పీటీసీ, 579 ఎంపీటీసీ స్థానాలకు, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 394 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరు జిల్లాలో 34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు, చిత్తూరు జిల్లాలో 35 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు, కడప జిల్లాలో 12 జడ్పీటీసీ, 118 ఎంపీటీసీ స్థానాలకు, కర్నూలు జిల్లాలో 37 జడ్పీటీసీ, 492 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 63 జడ్పీటీసీ, 791 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. అవ‌స‌ర‌మైతే ఈ నెల తొమ్మిదో తేదిన రీపోలింగ్ నిర్వ‌హిస్తారు… ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం హైకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాతే ప్ర‌క‌టిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Prabha News