Tuesday, April 23, 2024

వైఎస్ వివేకా హ‌త్య నిగ్గు తేలాల్సిందే … విజ‌య‌మ్మ‌

మా అందరి అభిప్రాయమిదే
సునీతకు అందరి మద్దతు ఉంది
జగన్‌ తండ్రికి తగ్గ తనయుడు
కుట్రపూరిత ఆరోపణలు
చంద్రబాబు బాటలో పవన్ – వైఎస్‌ విజయమ్మ బహిరంగ లేఖ

అమరావతి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ సోమవారం సాయంత్రం తమ ప్రత్యర్ధులకు బహిరంగ లేఖ రాశారు. తన కుమారుడు, ముఖ్యమంత్రి జగన్‌ పై తప్పుడు ఆరోపణలతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్‌ బాబును రాజకీయంగా ఎదుర్కో లేక కక్ష కట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె లేఖలో ధ్వజమెత్తారు. తన భర్త, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించినప్పటి నుంచి కొన్ని శక్తులు తమ కుటు-ంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనీ, ఈ విషయం రాజ కీయాలమీద ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు పన్నిన కుట్ర బాటలో గడిచిన ఏడేళ్ళుగా పవన్‌ కళ్యాణ్‌ కూడా నడుస్తున్నాడని అన్నారు. తన మరిదైన వైయస్‌ వివేకానందరెడ్డి ను ఎవరు హత్య చేశారన్న సంగతి ఖచ్చి తంగా నిగ్గు తేలాల్సిందే. ఇది తన మాట..జగన్‌ మాట..ఇదే షర్మి ల మాట అని లేఖలో విజయమ్మ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ కుటు-ంబమంతా ఏకాభిప్రాయంతో ఉందన్నారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ హత్య తరువాత రెండున్నర నెలల పాటు- చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి చంద్ర బాబు ప్రభుత్వంలో మంత్రి, పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి పాత్రమీద అనేక అనుమానాలున్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయనను తిరుపతిలో స్టేజీమీద పెట్టుకున్న పవన్‌ కల్యాణ్‌..దర్యాప్తు సీబీఐ చేతిలో…అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్‌ మీద విమర్శలు చేయటం విడ్డూ రంగా ఉందన్నారు. ఇక్కడే మరో విషయం… జగన్‌మీద హత్యా యత్నం 2018 అక్టోబరులో జరిగితే… 2019 మే చివరి వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అంటే దర్యాప్తుకు సంబంధించిన కీలక సమయంలో మా ప్రత్యర్థి, కుటుంబ‌ పరంగా కూడా మమ్మ ల్ని ద్వేషించే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ కేసుల్ని డీల్‌ చేశా రన్న నిజాన్ని పవన్‌ కళ్యాణ్‌ మరిచిపోయారని విజయమ్మ అన్నారు. హత్య కేసు దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఐఏ చేయాలి. ఈ రెం డూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావు. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దర్యాప్తు వేగం పెంచాలని మధ్యలో జగన్‌బాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని ఆమె ప్రస్తావించారు. ఒక రాష్ట్రా న్రికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ తన బాబాయి హత్య కేసే అయినా..కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు చేస్తున్నప్పుడు చేయగలిగేది ఏముంటు-ందని ఆమె ప్రశ్నించారు. డాక్టర్‌ వైయస్సార్‌ మరణాన్నే తీసుకోండి..ఆయనది మరణమా, లేక హత్యా అన్న అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. తమకు కూడా అను మానం ఉన్నా ఏం చేయగలిగామని ఆమె ప్రశ్నించారు. వివేకా నందరెడ్డిని హత్య చేసినవారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని ఆయన కుమార్తె సునీత డిమాండ్‌ చేస్తు న్నారు. తమందరి మద్దతు సునీతకు ఉందని విజయమ్మ అన్నారు. తన ఇద్దరు పిల్లలు ప్రజాసేవలో ఉన్నారనీ, పట్టు-దలతో అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement