Friday, March 29, 2024

విద్యుత్ కోతలతో.. అల్లాడిపోతున్న ప్రజలు

గుంటూరు జిల్లాలో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ అధికారులు మరమ్మతుల పేరుతో రిపేర్ అంటూ గంటల తరబడి కరెంట్ తీయడంతో చంటి పిల్లలు, వృద్ధులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. గుంటూరు డి9 విద్యుత్ కార్యాలయంలో రెండో శనివారం విద్యుత్ మరమ్మతులు అంటూ ఈరోజు ఉదయం 9 గంటల నుండి నెహ్రూ నగర్, బుచ్చయ్య తోట, బొంగరాల వీడు, వసంత రాయపురం, శ్రీనగర్, తదితర ఏరియాలలో విద్యుత్ అధికారులు విద్యుత్తును మరమ్మతుల నిమిత్తం నిలిపివేశారు. విద్యుత్ అధికారులు ఒక రోజు ముందు పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇవ్వకుండా విద్యుత్తును ఎలా మరమ్మతులు చేస్తారని ఇక్కడ నివసించే స్థానికులు విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు. ఒకరోజు కరెంటు బిల్లు కట్టకపోతే మరుసటి రోజు వచ్చి ఆ ఇంటికి వున్న ఫీజులు విద్యుత్ అధికారులు తీసేస్తారు. అలాగే కరెంటు తీసే ముందు పేపర్ స్టేట్ మెంట్ అయినా ఇచ్చి.. ప్రజలకు తెలిసేలా చూడాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement