Tuesday, April 16, 2024

వినాయక నిమజ్జనం ఊరేగింపులో విధ్వంసం.. ఇంటికి నిప్పు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో విధ్వంసం చెలరేగింది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో రెండు వర్గాలకు చెందిన వారు విధ్వంసం సృష్టించారు. రాళ్ళు, కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఈ విధ్వంసం జరిగిందని తెలుస్తోంది. టీడీపీ వర్గీయుల ఇళ్ళపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపించినట్లుగా సమాచారం.

వీధుల్లో మంటలు చెలరేగడం, ఇళ్ళపై మంటలు వేయడం సహా కర్రలు, రాళ్ళతో కొట్టుకోవడం సంభవించిందని వినిపిస్తుంది. దీంతో కొప్పర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు విద్వేషాలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ నానా రభస చేశారు. దీంతో కొప్పర్రు ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక బలగాలతో సహా భారీగా మోహరించారు. ఈ విధ్వంసంలో ఎంతమందికి గాయపడ్డారనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement