Wednesday, September 27, 2023

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు దారుణం చోటుచేసుకుంది. ద్విచ‌క్ర‌వాహ‌నంలో వెళ్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ సమీపంలో ముగ్గురు విద్యార్థులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పొన్నెకల్లు గ్రామానికి చెందిన నామాల సాయికుమార్‌(22), నూతక్కి నాగమల్లేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. తాళ్లూరి అజయ్ కుమార్ (22) అనే మరో విద్యార్థికి కాళ్లు విరిగాయి. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. సీసీ పుటేజీలు ప‌రిశీలించి కేసు ద‌ర్యాప్తును ప్రారంభించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement