Friday, April 19, 2024

ఏపీ ప్రయాణికులపై ఒడిశా, తమిళనాడు, కర్నాటక ఆంక్షలు

అమరావతి, : ఏపీని కరోనా వైరస్‌ వెంటాడుతోంది. నిత్యం 11 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందో ళన పెంచుతోంది. మరోవైపు మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి బయటకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఆంక్షలు తప్పడం లేదు. ఇప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకున్నా.. ఇతర రాష్ట్రాలు మాత్రం బాబోయ్‌ ఏపీ నుంచి.. రానే రావొద్దు అంటు-న్నాయి. ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఊహించని స్థాయిలో ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా కరోనాతో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల బోర్డర్‌ లలో పరిస్థితి దారుణంగా ఉంది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాలి అనుకునే వారికి.. శ్రీకాకుళంలో నుంచి ఒడిశా వెళ్లాలి అనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు. ఆంధ్ర నుంచి తమ రాష్ట్రాన్రికి వచ్చే వారు ఎవరైనా తప్పక ఈ పాస్‌ తీసుకోవాలని పక్క రాష్ట్రాల్రు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడులో ఇటీ-వల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలొ  పళనిస్వామి ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు- ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని స్పష్టం చేసింది. దీంతో సరిహద్దు దాటి వెళ్లాలి అనుకునే వారు చాలా కష్ట పడాల్సి వస్తోంది. అంతరాష్ట్ర ప్రయాణలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అత్యవసరం, తప్పని సరి అనుకున్నవాళ్లు ఇతర రాష్ట్రాల్రకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బోర్డర్‌ దాటి తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే తప్పక థర్మల్‌ స్కీన్రింగ్‌ కు ఒఫ్పుకోవాలని కండిషన్‌ పెడుతున్నాయి.- కరోనా లేదనే నెగిటివ్‌ రిపోర్ట్‌ కూడా చూపెట్టా లని బోర్డర్‌ దగ్గర పోలీసులు నిలదీస్తున్నా రని ఏపీ బోర్డర్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ ఆంక్షలు మరింత కఠినం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్ర బోర్డర్‌ దగ్గర మాత్రమే అడ్డంకులు ఎదురవుతున్నాయి. లాక్‌ డౌన్‌ నాటి పరిస్థితి తలెత్తి.. జిల్లాల సరిహద్దుల్లోనూ చెక్‌ పోస్టులు వెలిసే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఒడిశాతో చాలా అసవరాలు ఉంటాయని.. కానీ బోర్డర్‌వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారని శ్రీకాకుళం జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement