Wednesday, April 17, 2024

నేత్రపర్వంగా శివ పార్వతుల కళ్యాణం…

మంగళగిరి: ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్- మహశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నగరంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి (శివాలయం) దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణోత్సవం శనివారం అర్థరాత్రి అత్యంత కన్నుల పండువగా జరిగింది. పరమేశ్వరుడికి యజ్ఞోపవీతధారణ పర్వాలు జరిపిన అర్చకులు జీలకర్రబెల్లం, కన్యాదానతంతు నిర్వహించారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి మెడలో పరమేశ్వరుడు మాంగల్యధారణ చేశారు. స్వామి, అమ్మవార్ల శిరస్సులపై ముత్యాల తలంబ్రాలను అర్చక, వేద పండితులు వేదోక్త పఠనాల నడుమ అలంకరింపజేసే ఆధ్యాత్మిక ఘట్టాలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ వైభవంగా కొనసాగాయి.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement