Saturday, July 24, 2021

గుంటూరు జిల్లాలో దారుణం.. ఏడు నెలల పాపపై అఘాయిత్యం

గుంటూరు జిల్లాలో ఏడు నెలల పసికందుపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల మండలం బోదనంపాడు గ్రామంలో సోమవారం రాత్రి చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి తల్లి పక్కనే నిద్రపోయింది. తెల్లారేసరికి పాప ఊయలలో కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు పాప కోసం వెతకగా.. పాప ఇంటికి కొద్ది దూరంలో అపస్మారక స్థితిలో పడి ఉంది. పాప పెదాలు, మర్మావయాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పాపను మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే పాపకు గాయాలు ఉండటంతో వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. పాప సమాచారం అందుకున్న మాచర్ల సీఐ, విజయపురిసౌత్ ఎస్సై ఈ ఘటనపై విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. కాగా జీజీహెచ్ వైద్యుల నివేదిక వచ్చాక పాపపై అఘాయిత్యం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News