Wednesday, March 29, 2023

Road Accident: బాపట్లలో విషాదం.. ఆటో బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించారు. మ‌రో 15 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులు కృష్ణా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement