Friday, April 19, 2024

గుంటూరు మార్కెట్ యార్డ్ కి పోటెత్తిన మిర్చి…

అమరావతి, ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందిన గుంటూరు యార్డుకు రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా మిర్చి టిక్కీలు వచ్చాయి. వరుస సెలవులు రావడంతో యార్డులో లావాదేవీలు నిలిచిపోవడంతో యార్డుకు మిర్చి టిక్కీలు పో-టె-త్తాయి. దీంతో యార్డుకు వచ్చిన మిర్చి దిగుమతి చేసేందుకు ఖాళీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నారు. ప్రస్తుతం సీజన్‌ తారా స్థాయికి చేరుకోవడంతో నిత్యం లక్ష మిర్చి టిక్కీలకు పైగా ఇక్కడికి వస్తుం డగా సెలవులు కారణంగా యార్డులో నిల్వల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రెండు లక్షల టిక్కీలకు పైగా యార్డు ప్రాం గణలో నిల్వ ఉన్నాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే, శనివారం, ఆదివారంలు యార్డుకు సాధారణ సెలవుదినాలు, సోమవారం జగ్జీవన్‌ రామ్‌ జయంతి పబ్లిక్‌ హాలిడే కావడంతో వరుసగా నాలుగు రోజులు యార్డు గేట్లు- మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో మంగళవారానికి యార్డు నిండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీని దృష్ట్యా సీజన్‌ ముగిసేంత వరకు శలవు రోజుల్లో కూడా ట్రేడింగ్‌ జరపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ-కి మార్చి, ఏప్రిల్‌, మే నెల మొదటి వారం వరకు భారీగా మిర్చి టిక్కీలను రైతులు విక్రయానికి తీసుకొస్తుంటారు. ఈ మూడు నెలల్లో రోజుకు సగటు-న లక్ష టిక్కీలు వస్తాయి. కొనుగోళ్లు కూడా అంతేస్థాయిలో జరుగుతుంటాయి. లేకుంటే మిర్చి ధర పతనం అయిపోతుంది. ఈ ఏడాది కొనుగోళ్లు కూడా ఆశాజనకంగానే కొనసాగుతున్నాయి. అయితే వరుస సెలవుదినాలు రైతులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. గురువారం సాయంత్రానికే 1,71,475 మిర్చి టిక్కీలు యార్డులో నిల్వ ఉన్నట్లు- అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మంగళవారానికి మూడు లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు- అంచనా. ఇప్పటికే యార్డులోని దిగుమతి కొట్లు- అన్నీ మిర్చి టిక్కీలతో ఖాళీ లేకుండా నిండిపోయాయి. ఆయా దుకాణాల ఎదుట ఉన్న రోడ్ల పైన కూడా డంపింగ్‌ చేశారు. మంగళవారం నాటికి ట్రాఫిక్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు-గా భావిస్తున్నారు. కాగా ఈ నెలలో మరికొన్ని సెలవుదినాలు కూడా ఉన్నాయి. 10న రెండో శనివారం, 13వ తేదీన ఉగాది, 14న అంబేద్కర్‌ జయంతి, 21 శ్రీరామనవమి సెలవుదినాలు కూడా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సెలవులు కారణంగా ట్రేడింగ్‌ జరగక యార్డులో నిల్వలు పెరిగిపోయి ధరలు పతనం అయ్యే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా ట్రేడింగ్‌ కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై మిర్చియార్డు పాలకవర్గం సాధ్యమైనంత త్వరగా భేటీ- అయి సానుకూల నిర్ణయం తీసుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement