Wednesday, April 14, 2021

పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా …. అశోక్

రాజుపాలెం : గ్రామస్తులు సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని రాజుపాలెం నూతన సర్పంచ్ పులిబండ్ల అశోక్ అన్నారు. శనివారం రాజుపాలెం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జయప్రకాశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకార మహోత్సవం లో సర్పంచి పులిబండ్ల అశోక్ తో పాటు ఉపసర్పంచ్ చేవూరి లక్ష్మీ తిరుపతమ్మ వార్డు సభ్యులు పాలెపల్లి రాము ,మర్రిబోయిన రమాదేవి రాయల రమాదేవి యనుమల తిరుపతిరావు నామాల కోటి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు . ఈ సందర్భంగా సర్పంచ్ పులిబండ్ల అశోక్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు పేద ప్రజలందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. శాసన సభ్యులు అంబటి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తా మన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్వో నాగ శిరీష ,డిజిటల్ అసిస్టెంట్ సూర్య ,పులిబండ్ల నరసింహరావు ,కేదారి నాగేశ్వరరావు ,గాసి శ్రీను తదితరులు పాల్గున్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News