Thursday, April 25, 2024

పోలీసులకు బాడీ ఫిట్ నెస్ అవసరం : డీఐజీ త్రివిక్రమ్ వర్మ

గుంటూరు క్రైo : పోలీసుల‌కు బాడీ ఫిట్ నెస్ అవ‌స‌ర‌మ‌ని డీఐజీ త్రివిక్ర‌మ్ వ‌ర్మ అన్నారు. గుంటూరు రేంజ్ స్పోట్స్ మీట్ ను డీఐజీ త్రివిక్రమ్ వర్మ ప్రారంభించారు. గుంటూరు రేంజ్ పరిధిలోని నెల్లూరు, గుంటూరు అర్బన్, ప్రకాశం, గుంటూరు రూరల్ జిల్లాల్లో ఈమధ్య కాలంలో స్పోట్స్ మీట్ (పోలీస్ క్రీడలు) పూర్తి చేసుకున్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో విజయం సాధించిన వారికి, రేంజ్ పరిధిలో క్రీడలు నిర్వహించేందుకు గుంటూరు సిటీలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీలతో కలసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్, నెల్లూరు, గుంటూరు రూరల్, ప్రకాశం జిల్లాల ఎస్పీలు, ఏఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement