హైదరాబాద్/అమరావతి – కర్నాటకలో కరోనా తీవ్రత మరింత పెరగడంతో రేపటి నుంచి 14 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం…రేపు ఉదయం ఆరు గంటల నుంచే లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు.. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవల వాహనాల తప్ప ఇతర రవాణా వాహనాల రాకపోకలను నిషేధించారు.. అంతరాష్ట్ర సర్వీస్ లను సైతం నిషేధించారు.. దీంతో కర్నాటక నుంచి తెలంగాణ, ఎపికి వచ్చే అన్ని ప్రయాణ వాహానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్నాయి.. లాక్ డౌన్ ప్రకటనతో బెంగుళూరు లోని ఐటి కంపెనీలలో పని చేసే తెలుగువారితో అత్యధికులు తమ తమ తమ స్వస్థలాలకు పయనమయ్యారు.. బోర్డర్ వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు చేసిన అనంతరమే వారితో వదులుతున్నారు.. అలాగే తెలంగాణ, ఎపిలకు వస్తున్న వారంతా తమ వెంటనే కరోనా పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు..