Monday, November 4, 2024

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రేస్ లో నీలం సాహ్ని….

అమరావతి – ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల 31వ తేదితో ముగియ‌నుంది.. ఆయ‌న 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.. రాజ్యాంగబ‌ద్ద ప‌ద‌విని వెంట‌నే భ‌ర్తీ చేయాల‌నే నిబంధ‌న ఉండ‌టంతో ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌స‌రత్తు ప్రారంభించారు..ప‌లువురు విశ్రాంత ఐఎఎస్, ఐపిఎస్ ల పేర్ల‌తో పాటు మాజీ న్యాయ‌మూర్తుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రేసులో ఎపి మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి స‌ల‌హ‌దారుగా కొన‌సాగ‌తున్న నీలం సాహ్ని ముందు ఉన్న‌ట్లు స‌మాచారం.. ఆమె పేరే ఖ‌రారుకావ‌చ్చ‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement