Friday, December 2, 2022

వైఎస్ జగన్ రెండేళ్ల పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి

తెనాలి :ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం స్థానిక గంగానమ్మ పేట లోని తెనాలి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఖలేదా నసీమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్లలో 90 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను నేరుగా అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. పూజ్య బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి నాందిపలికిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని కొనియాడారు. నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు అక్కి దాస్ కిరణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు ఏళ్ళ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ విపత్తు సమయంలోనూ ప్రజలందరికీ అండగా నిలిచిన ప్రభుత్వం అన్నారు. విద్య వైద్యం తో పాటు వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ వైసిపి నాయకులు యేసు శ్రీనివాసరావు బూరెల దుర్గ ప్రసాద్ రఘురామిరెడ్డి మన్నవ ప్రభాకర్ కఠారి హరీష్ పలువురు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement