Wednesday, December 11, 2024

AP | రైస్ మిల్లుల్లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ..

గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఏడు చోట్ల రైస్‌ మిల్లులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్తెనపల్లి రామలింగేశ్వర ట్రేడర్స్‌ రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. రైస్‌ మిల్లులో దాదాపు 100 టన్నుల పీడీఎస్‌ రేషన్‌ గుర్తించిన మంత్రి… రైస్‌ మిల్లులో పీడీఎస్‌ రైస్‌ను ఎందుకు గుర్తించలేదని స్థానిక ఎమ్మార్వో చక్రవర్తిని ఆయన ప్రశ్నించారు.

జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గొనేరే ఆధ్వర్యంలో మెట్రాలజీ, సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు రైస్‌ మిల్లులోని ప్రతి బ్యాగ్‌ని పరిశీలించాలని, పంచనామా చేసి క్రిమినల్‌ ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయాలని, రైస్‌ మిల్లును సీజ్‌ చేయాలని మంత్రి మనోహర్‌ ఆదేశించారు.

సత్తెనపల్లి టౌన్‌లోని సీతారామాంజనేయ సాయిగణేష్‌ రైస్‌మిల్ ఫ్లోర్‌మిల్‌, శ్రీదేవి ట్రేడర్స్‌, రావు రైస్‌మిల్ ఫ్లోర్‌మిల్‌, కొమెరపూడిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైస్‌ మిల్లును మంత్రితో పాటు అధికారులు తనిఖీ చేశారు. కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని అందిస్తోందని, అదేవిధంగా సబ్సిడీ ధరలపై కందిపప్పు, పంచదార, పామాయిల్‌ అందిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement