Thursday, April 18, 2024

ప్రాణాలు గ‌ట్టివి.. కృష్ణాలో ప‌డ్డా బ‌తికారు..వీడియోతో

కృష్ణా న‌దిలో బోట్ రైడ్ కి వెళ్లిన ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. పెను ప్రమాదం త‌ప్ప‌డంతో భ‌వాని ఐలాండ్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. స‌ర‌దాగా ఇద్దరు యువకులు బంపర్ రైడ్ కు వెళ్లారు. ఈ క్ర‌మంలో వేగంగా వెళ్తున్న బంపర్ ఒక్కసారిగా అదుపుతప్ప‌డంతో యువకులు నదిలో పడిపోయారు. వెంట‌నే స్పందించిన సిబ్బంది బోట్ లో వారి వ‌ద్ద‌కు వెళ్లి ర‌క్షించారు. రైడ్ స‌మ‌యంలో ఇద్ద‌రు యువ‌కులు లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో ప్రమాదం త‌ప్పింద‌ని సిబ్బంది తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement