అమరావతి – ప్రధాని మోడీ, జనసేనాని పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకోవడం వల్లే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారంటూ మంత్రి కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడి జీవితమంతా మేనేజ్ చేయడమేనని, పదవుల కోసం ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా అయన సిద్ధమని అన్నారు…కాగా, ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల నుంచి పారిపోయిన చరిత్ర చంద్రబాబుదంటూ మండిపడ్డారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్జీమర్స్ వచ్చింది ప్రజలకు కాదు చంద్రబాబుకు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల నుంచి పారిపోయిన చంద్రబాబు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు ఖాయం అని చెప్తారని అయితే అవి పూర్తయ్యాక మళ్లీ పది రోజులు కనపడరంంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హోదా అడిగితే కేసులు పెడతారని భయపడే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ కాదన్నారు. అధికారంలో ఉన్న సోనియాని ఎదిరించి నిలబడ్డారని, ఆయనపై పెట్టిన కేసులు అన్ని దొంగ కేసులని అన్నారు.
మోడీ, పవన్ కాళ్లు పట్టుకోవడం వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు…

Previous articleఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు..
Next articleఆర్డీఓకు వినతిపత్రం..
Advertisement
తాజా వార్తలు
Advertisement