Wednesday, March 27, 2024

అంచెలంచెలుగా హ‌స్తిన ధ‌ర్మ‌పీఠానికి….

అమరావతి, : దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఉన్నత పీఠమైన ప్రధాన న్యాయమూర్తి (చీఫ్‌ జస్టి స్‌)గా తెలుగు తేజం నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు. 1967లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టి స్‌ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన తొలి తెలుగు వ్యక్తి. ఆయన తరువాత జస్టి స్‌ రమణకు ఆ పదవి వరించింది. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టి స్‌ ఎన్‌వీ రమణ.. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమే న్యాయానికి ఉన్న అర్థమని ఆయన ఎప్పుడూ భావిస్తారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మిగిలిపోతుందన్న అంబేద్కర్‌ సిద్దాంతాలను ఎల్‌వీ రమణ నిరంతరం విశ్వసిస్తుంటారు. సకాలంలో ఇచ్చే న్యాయమైన తీర్పులు సాంకేతికత సహాయంతో అందే శీఘ్ర న్యాయపాలనే సమర్థ న్యాయ నిర్వహణకు గీటు రాళ్లని కూడా ఆయన ఎప్పుడూ చెబుతారు. న్యాయ వ్యవస్థ లో గొప్ప న్యాయమూర్తులుగా ఎవరూ గుర్తించపోయినా పర్వాలేదు కానీ రాజ్యాంగ ధర్మం తప్పకూడదనే విధానాన్ని ఆయన ఎప్పుడూ అనుసరిస్తుంటారు. ఆ దిశగానే రాజ్యాంగ పరిధిలో న్యాయబద్దమైన నిర్ణయాలు తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయ వ్యవస్థ కు రూపకల్పన చేయాలని ఆయన పదేపదే చెబుతుంటారు. న్యాయమనేది ఓ పదంలా కనిపించినా భారత రాజ్యాంగంలో దానికి విస్తృత అర్థం ఉందని ఎన్‌వీ రమణ చెబుతుంటారు.
నిష్పక్షపాత వైఖరి.. ఆయన సహజ గుణం
రూల్‌ ఆఫ్‌ లా.. న్యాయ వ్యవస్థ బలొ పేతమైతే ప్రజాస్వామ్యం బలోపేతమై నట్లేనని విశ్వసించే జస్టి స్‌ ఎన్‌వీ రమణ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ రూల్‌ ఆఫ్‌ లా పాటించాలంటారు. విభ జనలు, దోపిడీలతో గడిచిన గతం సమసమాజ స్థాపన కోసం అంకితమైన భవిష్యత్తు మధ్య వంతెన నిర్మించే ప్రయత్నం రాజ్యాంగం చేస్తుందని ఆయన పదేపదే చెబుతుంటారు. రాజ్యాంగం హక్కుతో పాటు బాధ్యతలను నిర్దేశిం చిందన్న విషయాన్ని ప్రజలంతా గ్రహించాలని పలు సందర్భాల్లో చెబుతుంటారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఇబ్బందులు తప్పవని అంటుంటారు. ఆ దిశగానే ఆయన నిబద్దతతో న్యాయ వృత్తి చేపట్టి అంచెలంచలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు.
అంచెలంచలుగా ఎదిగిన రమణ
కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న వ్యవసాయ కుటుంబంలో రమణ జన్మిం చారు. గణపతిరావు-సరోజి నిలు ఆయన తల్లిదం డ్రులు. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యా సం పూర్తి చేసిన ఆయన.. అమరావతిలోని ఆర్‌వీవీఎన్‌ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10వ తేది రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై న్యాయవృత్తిని ప్రారంభించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌లో ప్రాక్టీస్‌ చేశారు. సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన క్రిమినల్‌, సర్వీసు, అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన కేసులను ఆయన వాదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అదేవిధంగా పలు ప్రభుత్వ సంస్థ లకు ప్యానల్‌ అడ్వకేటర్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. అలాగే అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000వ సంవత్సరం జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిం చారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. అప్పటి నుండి అనేక కీలకమైన అంశాలను విచారించిన ధర్మాసనాల్లో ఆయన కీలకమైన సభ్యులుగా ఉన్నారు. ఆర్టికల్‌-370 రద్దు, వ్యా జ్యాలు, సాయుధ దళాల్లో మహి ళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు, ఆర్‌టీఐ పరిధిలోకి సీజేఐ కార్యా లయం వంటి వ్యాఖ్యలపై విచా రణ చేపట్టి కీలక తీర్పులను ఇచ్చా రు. అదేవిధంగా జమ్మూ కాశ్మీ ర్‌లో ఇంటర్నెట్‌ నిషేధం, సీజేఐ కార్యా లయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం, సహ ప్రజా ప్రతినిధులపై నమో దెన క్రిమినల్‌ కేసుల విచారణ వంటి కేసుల్లో కీలకంగా వ్యవహ రించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో చారిత్రాత్మక తీర్పులను వెలువరించి ధర్మాసనంలో జస్టి స్‌ ఎన్‌వీ రమణ సభ్యులు. అదేవిధంగా 2020 సెప్టె ంబరు 17న ఎన్‌వీ రమణ నేతృత్వంలోనే సుప్రీం ధర్మాసనం అన్నీ రాష్ట్రాల హైకోర్టులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేసి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్క రించాలని ఆదేశించింది. న్యాయ వ్యవస్థ లో కీలకమై న సమీకరణలకు శ్రీకారం చుట్టిన ఆయన.. అంచెలం చలుగా ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ సమాజ సేవలో కూడా తనవంతు పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement