Wednesday, May 19, 2021

పాడి పంట‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడాలి – జ‌గ‌న్

అమ‌రావ‌తి – రాష్ట్ర ముఖ్యమం త్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలనీ, పంటలు బాగా పండాలనీ, రైతులకు మేలు కలగా లనీ, రాష్ట్రం లోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడా లనీ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని అభిలషిం చారు. తెలుగువారితో పాటు- ప్రపంచం మొత్తం కరోనా పీడ నుంచి శాశ్వతంగా విముక్తం అయ్యేలా దేవుడు చల్లగా చూడాలని కోరారు. షడ్రు చుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి.. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News