Thursday, April 25, 2024

మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

అమరావతి – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. మహిళా దినోత్సవం రోజున స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దిశ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. కాలేజీల్లో దిశపై ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. హోర్డింగుల్లో దిశ యాప్‌ సహా అన్ని రకాల వివరాలు ఉంచాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement