Saturday, September 30, 2023

గుంటూరు మిర్చి ‘యార్డ్’కు ఐపి ల ఘాటు

గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ‘ఐపీల’ ఘాటు నషాళానికి అంటు తోంది. కొందరు వ్యాపారుల చేతివాటంతో మిర్చి రైతులు లబోదిబో మంటున్నారు. ఆరు గాలం శ్రమించి, రుణబాధలను అధిగమించి పంట చేతికొచ్చిన సమయంలో నమ్మకంగా నయవంచనకు గురవుతున్నారు. ప్రతి సీజన్‌ లో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే మిర్చియార్డులో కోట్లలో రైతులను మోసం చేసి ఉఢాయిస్తున్న సంఘటనలు సాధారణంగా మారుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, మిర్చియార్డు పాలకవర్గం, అధికా రులు చొరవ చూపించకపోవడం దురదృష్ట కరం. ప్రస్తుతం జోరుగా మిర్చి సీజన్‌ కొనసాగు తోంది. గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు, ఒంగోలు, పశ్చిమగోదావరి, తెలంగాణాలోని కొన్ని జిల్లాల నుంచి నిత్యం లక్ష టిక్కీల వరకు సరుకు దిగుమతి అవుతోంది. ఆదాయం ఎక్క డుంటే అక్కడ అక్రమార్కులు వాలిపోతుంటా రు. ప్రతి సీజన్‌లో గుంటూరు మిర్చియార్డులో ఇదే జరుగుతోంది. మిర్చియార్డు ప్రతిష్ఠ కొంద రు వ్యాపారుల చేతివాటం కారణంగా మసక బారుతోంది. మిర్చి సీజన్‌ వచ్చిందంటే ఏటా ఏదో ఒక సంచలనం ఉండాల్సిందే. గత ఏడాది ఇద్దరు మిర్చి వ్యాపారులు దివాళా పెట్టి వెళ్లి పోగా, ఈ ఏడాది మిర్చి సీజన్‌ ప్రారంభమవ్వ గానే ఓ వ్యాపారిని మరో వ్యాపారి కిడ్నాప్‌ చేయించడం ట్రేడ్‌ వర్గాలు ఉలిక్కిపడేలా చేసిం ది. వ్యాపారుల మధ్య జరుగుతున్న ఆర్థికపర మైన లావాదేవీల నేపథ్యంలో వివాదాలు, విభేదాలు తీవ్రమై రచ్చకీడుస్తున్నాయి. మిర్చి వ్యాపారులు నరేంద్రకుమార్‌, వెంకట్రావుల మధ్య సంవత్సరాల తరబడి కొనసాగుతున్న బిల్లు టు- బిల్లు ఫైనాన్స్‌ వ్యవహారమే కిడ్నాపనకు దారి తీసిందన్న చర్చ ఎగుమతి, దిగుమతి వ్యాపారుల్లో నడుస్తోంది.

- Advertisement -
   

నమ్మించి నిలువునా ముంచుతున్నారు
గుంటూరు మార్కెట్‌ కమిటీ-లోని నిబంధనలను తమకు అవకాశంగా మలచుకుని అనతికాలంలోనే కోట్లాది రూపాయలకు కొందరు పడగలెత్తుతున్నారు. దిగుమతి వ్యాపారుల నుంచి సరకు కొనుగోలు చేసిన పక్షం రోజులకు కాస్త అటూఇటు-గా నగదు చెల్లింపులు చేస్తూ, కొన్ని సంవత్సరాలు నమ్మించి, తర్వాత నిలువునా ముంచేసి పోతున్నవారు కొందరైతే, ఏదో ఒక కమీషన్‌ ఏజెంట్‌ దుకాణంలో రెండు, మూడేళ్లు గుమస్తాగా పని చేసి వచ్చిన అనుభవంతో యజమాని దుకాణం వద్దకు వచ్చిన రైతులతో సంబంధాలు కొనసాగిస్తూ లైసెన్స్లు లేకుండా వ్యాపారాలు చక్కబెట్టు-కుంటూ పని నేర్చుకున్న తర్వాత యజమానికే సున్నం రాసేవారు మరికొందరు. అనధికారికంగా జరిగే కార్యకలాపాల కారణంగా మిర్చియార్డుకు చెడ్డ పేరు వస్తోంది. ఎగుమతి వ్యాపారం చేస్తున్న మిర్చియార్డు పాలకవర్గంలోనే సభ్యుడు ఒకరు గత ఏడాది ప్రథమార్థంలో కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇది మరువక ముందే అప్పట్లో భాగస్వామ్యంతో మిర్చి ఎగుమతి వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరు రాత్రికి రాత్రి మూట, ముల్లె సర్దుకుని గుంటూరు విడిచిపోయారు. ఈ విధంగా గతేడాది ఎగుమతి వ్యాపారులు సుమారురూ.25 కోట్లకు పైగానే ఎగనామం పెట్టారని దిగుమతి వ్యాపారులు వాపోతున్నారు.

దశాబ్ధ కాలం నుంచి ఇదే తంతు
గత పదేళ్లల్లో లెక్క చెప్పడానికి వీల్లేనంత మంది వ్యాపారులు దివాళా తీసి బోర్డులు తిప్పేసి ఉంటారని బాధితులు చెబుతున్నారు. 2010లో ఎగుమతి వ్యాపారులు దివాళా తీయడం ఆరంభమైంది. నల్లపాడు రోడ్డు ప్రధాన కేంద్రంగా చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్న ఎగుమతి వ్యాపారి రూ.15 కోట్లకు పైగా కమీషన్‌ ఏజెంట్లు-, కొందరు రైతులకు ఎగనామం పెట్టి బోర్డు తిప్పేసి పరారయ్యాడు. బాధితులకు న్యాయం చేద్దామని రంగంలోకి దిగిన చిల్లీస్‌, మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. ఆస్తిపాస్తుల వివాదం చిలికిచిలికి గాలివానలా మారి చివరకు న్యాయస్థానాల వరకు వెళ్లింది. దానిని వ్యాపారులు, రైతులు మరచిపోకముందే చుట్టు-గుంట సమీపంలో ప్రధాన కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న మరో ఎగుమతి వ్యాపారి రూ.18 కోట్లు- వరకు ఎగనామం పెట్టారు. ఈ వ్యాపారి దగ్గర నుంచి కూడా బాధితులకు ఒక్క పైసా అందలేదు. దివాళా తీసి వెళ్లిన వ్యాపారుల నుంచి సొమ్ములు వసూలు చేయాలని సంఘాల నాయకులు, కొందరు పెద్దలు శతవిధాలా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
లైసెన్స్లు, ప్లాటు- లేకుండా దిగుమతి వ్యాపారం చేసిన ఒకరు తాజాగా రూ.5 కోట్లు- వరకు ఎగనామం పెట్టారని వ్యాపారులు పేర్కొంటు-న్నారు. బిల్లు టు- బిల్లు ఫైనాన్స్‌ వ్యాపారం దీనికి కారణమంటు-న్నారు. దిగుమతి లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేసే వారికి లైసెన్స్‌ ఉన్నవారు ఫైనాన్స్‌ చేస్తున్నారు. ఇందుకు గాను 14 రోజులకు రూ.100కు రూ.1.50 పైసలు వంతున చెల్లించాల్సి ఉంటు-ంది. కడుపు మండిన బాధితులు నరేంద్రకుమార్‌ అనే వ్యాపారిని అపహరణకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిపోయారు. మిర్చి దివాళాకు సంబంధించి ప్రత్తిపాడు, లాలాపేట, నగరంపాలెం, నల్లపాడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. గత పదేళ్ళ నుంచి బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు, పల్నాడు, ఒంగోలుకు చెందిన రైతులు వ్యాపారి మోసానికి నష్టపోయారు. అధికారపార్టీ నేతలు బాధితుల పక్షాన కాకుండా, దివాళా తీసిన వ్యాపారులకు వకలత్తా పుచ్చుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆత్మహత్యలే శరణ్యం: బాధిత రైతు రామాంజనేయులు
మూడు జిల్లాకు చెందిన 40 మంది రైతులు నమ్మి మోసపోయామని పల్నాడు జిల్లా వెల్ధుర్తికి చెందిన రైతు లొట్టపల్లి రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులమంతా పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరామన్నారు. తమను మోసం చేసిన వ్యాపారి నరేంద్రకుమార్‌ నుంచి డబ్బు ఇప్పించాలని అభ్యర్ధిస్తున్నారు. అప్పులు చేసి పంటపండించామని, ఇపుడు డబ్బుచేతిక రాకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం, మిర్చియార్డు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement