Wednesday, March 27, 2024

ఎపిలో జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌కు హైకోర్టు బ్రేక్…

అమ‌రావ‌తి – ఎపిలో జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌కు విడుద‌లైన నోటిఫికేష‌న్ పై హైకోర్టు స్టే విధించింది..దీంతో ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు మ‌రోసారి బ్రేక్ ప‌డిన‌ట్లైంది.. ఈ నెల ఒక‌టో తేదిన కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు నోటిషికేష‌న్ విడుద‌ల‌ చేశారు.. గ‌తంలో ఆగిపోయిన చోటు నుంచే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఈ నోటిఫికేష‌న్ లో పేర్కొన్నారు.. దీంతో ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 8వ తేదిన జ‌ర‌గాల్సిన పోలింగ్ నిలిచిపోయింది. కాగా నీలం సాహ్ని విడుదల చేసిన నోటిఫికేషన్ పై టిడిపి, జనసేన, బిజెపిలతో సహా పలువురు హైకోర్టు ను ఆశ్రయించారు.. దీనిపై ఇరు వర్గాలు వాదనలను హైకోర్టులో వినిపించారు.. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ నాలుగు వారాలు ఉండాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.. అందుకు విరుద్ధంగా కేవలం 15 రోజులలో ఈ ఎన్నికల ప్రక్రియే విధంగా గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటీఫికేషన్ విడుదల చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది..సుప్రీం కోర్టు విధివిధానాలు పాటించడం లేదని భావించిన హైకోర్టు ఈ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చింది.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టిడిపి, బిజెపి, సిపిఐ లు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement