Wednesday, March 29, 2023

ఖైదీల‌కు పెంచిన జీతాల‌ను నాలుగు వారాల‌లో చెల్లించండి – హైకోర్టు..

అమరావతి – ఖైదీల వేతనాల పెంపు నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాలుగు వారాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఖైదీల వేతనాలను పెంచాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించగా… ఖైదీల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని మాత్రం అమలు చేయలేదు. ఈ విషయంపై విచారణ చేసిన న్యాయస్థానం.. 4 వారాల్లో పెంచిన వేతనాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement