Saturday, March 25, 2023

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మండ‌లంలోని అంబారుపేట వద్ద ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుండి ముసునూరు మండలం గుడిపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంట‌నే స్థానికులు పోలీసులకు స‌మాచారం అందిచ‌గా ఘ‌ట స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement