Wednesday, May 19, 2021

సరికొత్త మాఫియా – ఉభయ తెలుగు రాష్ట్రాలలో నకిలీ రెమిడిసివిర్……

పోలీసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలు
హైదరాబాద్‌ నుంచి గుంటూరు వరకు నకిలీ ర్యాకెట్‌ విస్తరణ
అవసరం లేకపోయినా సిఫార్సు చేయటం వెనక మతలబు
ప్రయివేటు వైద్యశాలల్లోనే ఈ ఇంజక్షన్ల కొరత ఎందుకు
నకిలీల మార్కెటింగ్‌ కోసమే కృత్రిమ డిమాండ్‌
గుంటూరు, : కరోనా బాధితులను ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ సంజీవనిగా ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ ఇంజెక్షన్‌ మార్కెటింగ్‌ అంతా నల్ల బజారుకు తరలిపోలడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వివాదం చెలరేగుతున్నది. అయితే అసలు నిజంగా ఈ ఇంజెక్షన్‌ కొరత వున్నదా? లేక కృత్రిమంగా సృష్టించారా? అన్న విషయాలు అధికారికంగా తేలాల్సి ఉంది. ఈ ఇంజెక్షన్‌ నల్లబజారుకు తరలిపోకుండా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటు-న్నది. గుంటూరు జిల్లాలో తాజా గా చోటు-చేసుకున్న పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తే, రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ల పేరుతో భారీగా నకిలీలు మార్కెట్‌లోకి ఇప్పటికే ప్రవేశించాయి. వాటికి మార్కెటింగ్‌ కల్పించేందుకే కొన్ని కార్పొరేట్‌ శక్తులు ఈ ఇంజెక్షన్‌ కోసం కృత్రిమ డిమాండ్‌ ఏర్పరచి, కొరత పేరుతో కోట్లు- కొల్లగొడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఇంజెక్షన్‌ లకు సంబంధించిన ఖాళీ బాటిళ్లను, వాటిని ప్యాక్‌ చేసే అట్టపె-్టట-లను సేకరించి వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపి వేల రూపాయలు కొల్లగొడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వీటి మూలాలు తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నకిలీ రాకెట్‌ లో పలువురు వైద్యులు సైతం వుండటం విశేషం. దీన్నిబట్టి చూస్తే ఈ నకిలీ రాకెట్‌ వెనుక వున్న కార్పొరేట్‌ భూతాలు ఎంతకు బరితెగించారో అర్థం అవుతున్నది.
వెలుగు చూసిందిలా…
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు వద్ద రెండు రోజుల క్రితం రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇరువురు వ్యక్తులను పట్టు-కున్నారు. వారిరువురిని విచారించిన పోలీసులకు నిర్ఘాంత పోయే వాస్తవాలు తెలిశాయి. తొలుత ఆ గ్రామానికి చెందిన ఒక మహిళకు కోవిడ్‌ రావటంతో చికిత్స నిమిత్తం విజయవాడ లోని ఒక ప్రయివేటు- వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు అత్యవసరంగా రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ కావాలని చెప్పటంతో, తెలిసిన వారి ద్వారా ఒక్కొక్క ఇంజెక్షన్‌ను 40 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. రెండు ఇంజెక్షన్‌లు చేసిన అనంతరం ఆమె కన్నుమూశారు. దీంతో అప్పటికి వారి వద్ద మిగిలి వున్న ఇంజెక్షన్‌ను తీసుకువచ్చి భద్రపరచారు. ఈలోగా ఆ గ్రామంలోనే మరొకరికి కరోనా చికిత్సలో భాగంగా ఇంజెక్షన్‌లు అవసరం అయ్యాయి. అంతకు ముందు కొనుగోలు చేసి భద్ర పరచిన ఇంజెక్షన్‌ను ఇచ్చారు. అద నంగా మరొక రెండు ఇంజెక్షన్‌లు డీల ర్‌ ద్వారా తెప్పించుకున్నారు. డీలరు దగ్గర నుంచి తెప్పించుకున్న ఇంజెక్షన్‌ కు, ఇంతకు ముందు బయట కొను గోలు చేసిన ఇంజెక్షన్‌కు రంగులో తేడా ఉండటంతో అనుమానం వచ్చింది. అ విషయాన్ని రెమిడిసివర్‌ ఇంజెక్షన్‌ లు సరఫరా చేసే అధీకృత డీలరు వద్దకు తీసుకెళ్ళారు. ఆ డీలరు పరీక్షించి అది నకిలీదిగా తేల్చి చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన ఆ వ్యక్తులు వాటిని విక్రయించిన వారిని పట్టు-కునేం దుకు వ్యూహం పన్నారు. అంతకు ముందు తాము సంప్రదించిన వ్యక్తీ ద్వారా తమకు మూడు ఇంజెక్షన్‌ లు కావాలని కబురుపెట్టారు. అంతకు ముందు చెల్లించిన ధరకంటే అధికంగా ఒక్కొక్క దానికి 60 వేల రూపాయలు చెల్లిస్తామని బేరం కుదు ర్చుకున్నారు. పధకం ప్రకారమే అక్కడ వున్న ఒక కళాశాల వద్దకు ఇరువురు వ్యక్తులు ఇంజెక్షన్‌లు తీసుకువచ్చారు. వెంటనే వారిని పట్టు-కొని పోలీసులకు అప్పగించారు. పోలీసు విచారణలో తెనాలి, బాపట్ల లకు చెందిన ఇరువురు ప్రయివేటు- వైద్యుల ద్వారా అ ఇంజెక్షన్‌ లు సరఫరా అవుతున్నట్టు- ఆ ఇరువురు చెప్పినట్టు- సమాచారం. అనంతరం వారిరువురిని పట్టు-కొని విచారించగా మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా తవ్వేకొద్దీ వేర్వేరు ప్రాంతాలలో వున్న వ్యక్తుల పేర్లు బయటకు వస్తుండటంతో వట్టిచెరుకూరు పోలీసులు అప్పటివరకు అరెస్ట్‌ చేసిన వారందరిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసును వివరాలన్నింటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఇదే తరహాలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు లో ఒక ప్రయివేటు- క్లినిక్‌ నిర్వహిస్తున్న వైద్యుడు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టు-బడ్డారు. ఆ వైద్యుని ద్వారా హైదరాబాదు లోని మరొక ఆసుపత్రి నుంచి ఈ ఇంజెక్షన్‌ లు సరఫరా అవుతున్నట్టు- గుర్తించారు. రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ డిమాండ్‌కు అను గుణంగా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన నెట్వర్క్‌ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యశా లలకు సక్రమంగానే సరఫరా అవుతున్నది. ఎక్కువమందికి ప్రభుతం నిర్దేశించిన ధరకే ఈ రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ లభిస్తున్నది. దీంతో ఏంచేయాలో పాలుపోని అక్రమార్కులు ఈ ఇంజెక్షన్‌ కోసం కృత్రిమ డిమాండ్‌ సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. హైదరాబాదు నుంచి గుంటూరు జిల్లా వరకు వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు వ్యక్తుల ప్రమేయం వెలుగు చూస్తుండటంతో ప్రభుతం ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఖాళీ సీసాలు సేకరించి
రెమిడిసివిర్‌ నకిలీ ఇంజెక్షన్‌ లు తయారు చేసే వ్యక్తులు ముందుగా కొన్ని ఆసుపత్రులలో అ-టె-ండర్‌, స్వీపర్‌, ఆయాల వంటి వారితో పరిచయం పెంచుకొని అక్కడ వాడి పడేసిన రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ ఖాళీ సీసాలు, వాటిపై ప్యాకింగ్‌ గా వచ్చే అట్టపె-్టట-లు, సీలు తొలగించిన అనంతరం వచ్చే ఆకుపచ్చని మూత లను సేకరించే వారని చెబుతున్నారు. అనంతరం వాటిలో సెలైన్‌ సీసాలలో వుండే రంగులేని ద్రవాన్ని నింపి ఆకుపచ్చ మూత జాగ్రతగా పెట్టి, ఫెవికాల్‌తో అతికించి జాగ్రత్తగా అట్టపె-్టట-లో ఎవరికీ అనుమానం రానిరీతిలో ప్యాక్‌ చేసేవారు. రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ కొనుగోలు చేసే వారికీ అది అసలుదా నకిలీదా అని తెలుసుకునే అవకాశం వుండదు. అయితే ఈ ఇంజెక్షన్‌ నిలువ వున్న కొద్దీ సీసాలో నింపిన ద్రవం రంగు మారుతుంటు-ంది. ఆ విధంగా రంగు మారినందువల్లనే ఈ వ్యవహారం గుట్టు- రట్టయింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News