Friday, April 19, 2024

గ్రామాభివృద్ధికి కృషి చేస్తా – సంద్యాదేవి..

కొల్లిపర, : గ్రామస్తులు సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని దావులూరు నూతన సర్పంచ్ అంబటి సంధ్యాదేవి అన్నారు. శనివారం దావులూరు పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి అందె శృతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకార మహోత్సవం లో సర్పంచి సంధ్య దేవి తో పాటు ఉపసర్పంచ్ గాజుల రమేష్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్య దేవి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు పేద ప్రజలందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తా మన్నారు. గ్రామస్తులు తమ పరిధిలోని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సంధ్య దేవి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement