Friday, October 11, 2024

నాగిరెడ్డి పాలెంలో మొసలి క‌ల‌కలం….

బెల్లంకొండ – వన్య ప్రాణులు జనవాసాలకు చేరుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డి పాలెం చెరువు పక్కన ఉన్న కాలువ వద్ద శనివారం మొసలి గట్టుమీద సెదతీరుతూ పక్కన కాలువలో ఈత కొడుతున్న చిన్నారులకు కనిపించింది. దీనితో చిన్నారులు పెద్దగా అరవడంతో మొసలి కాలువలో కి వెళ్లిపోయినట్లు చిన్నారులు తెలిపారు. ప్రతి నిత్యం ఆ కాలువకు నాగిరెడ్డి పాలెం గ్రామస్తులు బట్టలు ఉతకడం, చిన్నారులు ఈతకు వెళ్తుంటారు. గతంలో తాము ఎప్పుడు చూడలేదని వారు అంటున్నారు.మొసలి సంచారం పై సంబంధితశాఖ అధికారులు దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement