Tuesday, March 26, 2024

అందుబాటులోకి వ‌చ్చిన‌ అమరావతి కోవిడ్ కేర్ సెంటర్ …..

అమరావతి- కరోనా రెండో దశ అత్యంత ప్రమాదకరంగా, అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం మండల కేంద్రమైన అమరావతి లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలు అధైర్యపడవద్దని, కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, ఎవ్వరికైనా కరోనా సోకితే ఆ రిపోర్టులు తీసుకొని అమరావతిలోని కోవిడ్ కేంద్రాన్ని సంప్రదించాలని ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు, మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో 70 పడకల కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని ధ్యానబుద్ధ ఘాట్ వద్ద నున్న టూరిజం వారి హరిత రిసార్ట్ లో ప్రారంభిస్తామని కావున నియోజకవర్గంలోని ప్రజలు కరోనా సోకిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, ఇక్కడ 15 ఆక్సిజన్ పడకలు, 15 సాధారణ పడకల సదుపాయం కలదని ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు, నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం గమనించి తక్షణమే స్పందించి కోవిడ్ కేంద్రాన్ని వెంటనే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించినందుకు కోవిడ్ బాధితులు, ప్రజలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భవాని శంకర్, మెడికల్ ఆఫీసర్ స్వప్న, వైసీపీ నాయకులు కార్యకర్తలు మంగి శెట్టి శ్రీనివాసరావు, నిమ్మ విజయ సాగర్ బాబు, మేకల హనుమంతరావు, అన్నం శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement