Sunday, May 9, 2021

అధికారులు ఎంత శ్రమిస్తున్నా.. ప్రజలలో వీడని నిర్లక్ష్యం..

బాపట్ల టౌన్ – కరోనా కట్టడికి అధికార యంత్రాంగం ఎంత కృషి చేస్తున్నా కొందరు నిర్లక్ష్యం కారణంగా ఉద్దృత్తి రోజురోజుకు పెరుగుతుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది కువైట్ నిబంధనల అమలుకు పోలీసులు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది ఓ పక్క మరోపక్క పరీక్షలతో వైద్య సిబ్బంది యంత్రాంగం ఇస్తుంది ఇన్ని చేస్తున్నా కొందరు ఆకతాయిలు తన శైలి తమరి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు మాస్కులు ధరించి కుండా భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు నిర్లక్ష్య ధోరణి పాటిస్తున్నారు ప్రియ జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.

అధికంగా కేసులు నమోదు
మండలం,పట్టణంలో ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుంచి 30వరుకు చేసిన కరోన పరీక్షలలో అధికంగా కేసులు నమోదు అయ్యాయి.మండలంలోని మూడు పిహెచ్సి సెంటర్ల పరిధిలో 120 కేసులు నమోదు కాగ,పట్టణంలో 151 కేసులు నమోదు అయ్యాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప సభాపతి కోన రఘుపతి ఏరియా వైద్యశాలలో వంద బెడ్లు,హెచ్ఆర్డీ ప్రాంగణంలో 150 బెడ్లు ఏర్పటు చేసి కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు.జూన్ నెల ప్రారంభంతోనే పట్టణంలో 56 కేసులు నమోదు అయ్యాయి.వాటిలో కొందరు సరైయిన వివరాలు ఇవ్వక పోవడం,కొందరు గ్రామాల వారు కావడంతో 46 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.

కఠినంగా వ్యవగారిస్తున్నా..
నిబంధనల మేరకు పోలీసు అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరి నిర్లక్ష్యం కరోన విజృంభణకు దోహదపడుతుంది బాపట్ల మండల పట్టణ పరిధిలో పోలీసులు రోజు వ్యక్తి నిర్వహించి మాస్కు ధరించని వారికి కు అపరాధ రుసుం విధిస్తున్నారు అయినప్పటికీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప సభాపతి కోన రఘుపతి డిఎస్పీ శ్రీనివాస రావు,మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్,తహసీల్దార్ శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 3 నుంచి 15 రోజుల పాటు పట్టణంలో నిబంధనలను ప్రకటించారు.

పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనల బేఖాతర్
ఏరియా వైద్యశాలలో కరోన పరీక్షల నిమిత్తం సిబ్బందిని నియమించారు.ఇటీవల పట్టణంలో కేసులు అధికంగా నమోదు అవుతున్న కారణంగా కరోన వైరస్ సోకిన వారితో ఉన్న వారు టెస్టులు కోసం వైద్యశాలకు బారులు తీరుతున్నారు.టెస్టులు చేయంచుకువడానికి వచ్చిన ఎవరు కూడా భద్రతలు పాటించ కుండా టెస్టులు కోసం ఎగబడుతున్నారు.నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా గాలికి వదిలేస్తున్నారు.వైద్యశాల సిబ్బంది కూడా టెస్టుల కోసం వచ్చిన వారికి జాగ్రత్తలు పాటించాలని చెప్పక పోవడం గమనార్హకం.తాజాగా ట్రూనాట్ ల్యాబ్ ఏర్పటు చేశారు.అయిన టెస్టులకు వచ్చిన వారికి వైద్యశాల సిబ్బంది చెప్పక పోవడంతో,ప్రజలు కూడా నిర్లక్ష్య ధోరణితో నిబంధనలను తుంగలోకి తొక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News