Friday, April 19, 2024

స్వయం జాగ్రత్తలే… ప్రాణానికి రక్షణ

విజృంభిస్తున్న కరోనా
రక్షణ కొరకు మాస్కులు శానిటై జర్లు తప్పనిసరి
నగర మేయర్… కావటి మనోహర్ నాయుడు
నగర కమిషనర్… చల్లా అనురాధ
ర్యాలీలో పాల్గొన్న… ఎమ్మెల్యేలు… మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్

గుంటూరు సిటీ – ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి నుండి ప్రాణ రక్షణ పొందాలంటే స్వయ రక్షణను వజ్రాయుధంగా మలచుకొని తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్ లు వాడి కరోనాను తరిమికొట్టాలని నగర కమిషనర్ చల్లా అనురాధ, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ వజ్ర బాబు, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ లు సంయుక్తంగా నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోణ వైరస్ నుండి ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలో దాని సంబంధించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గురువారం నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో గుంటూరు నగరపాలక సంబంధించిన వివిధ రంగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, పలు డివిజన్ లకు చెందిన కార్పొరేటర్లు మహిళా సంఘాలు., పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పదిహేను రోజులపాటు కరోనా నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం సూచిస్తున్న సూచనలతో పాటు ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా విషయంలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చేయన్నారు ఈ విషయంలో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. కరోనా తో సహజీవనం రానున్న రోజుల్లో చేయ వలసీ వస్తుందన్న సీఎం అన్నమాట వాస్తవ రూపం దాల్చిందన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం తో పాటు., మాస్కూలు, శానిటైజర్ లు వాడాలన్నారు. నగర కమిషనర్ అనురాధ మాట్లాడుతూ కరోనా మొదటిసారి నగరంలో విజృంభిస్తున్న సమయంలో దాని నియంత్రణకు నగర ప్రజలు సహకరించిన సహకారం చాలా గొప్పదన్నారు. అదే విధంగా రెండో పర్యాయం నగరంలో విజృంభిస్తున్న కరోనాను నియంత్రించుటకు ప్రజలు అదే విధంగా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ లు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టడంలో నగర ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు వారి వద్ద నుండి సంపూర్ణంగా ఉంటాయని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement