Saturday, April 20, 2024

జిల్లా సాధించి..ఏకగ్రీవాలు చేసుకోండి….

బాపట్ల – ప్రజలను భయపెట్టి,భయభ్రాంతులకు గురి చేసి పట్టణంలో వార్డులన్ని ఏకగ్రీవలు చేసుకోవాలని ఉప సభాపతి కోన రఘుపతి ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదని కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ నాయకులు గంట అంజిబాబు అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నాయకుడు,నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసిపి అధికారంలోకి వచ్చిన 6నెలలలో బాపట్ల ను జిల్లా ను చేయడమే కాకుండా,మరికొన్ని పార్లమెంట్ స్థానాలను జిల్లాను చేస్తామని చెప్పారని,స్థానికంగా తనను గెలిపిస్తే జిల్లా తీసుకువస్తానని కోన రఘుపతి గతంలో వాగ్దానం చేసారని గుర్తు చేశారు.వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన బాపట్ల ని జిల్లా ఎందుకు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికలు వస్తున్న సమయంలో జిల్లా అంశన్నీ తెరపైకి తీసుకువస్తు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరి చేత మున్సిపాల్ ఎన్నికలను ఏకగ్రీవలు చేసుకోవాలని చెప్పించడం విడ్డురంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందే జిల్లా ప్రకటించాలని,అలా అయితే తమ పార్టీ కూడా ఏకగ్రీవలకు సహకరిస్తుందన్నారు.ఎన్నికల సమయంలో కొత్త రకాలుగా,కొత్త ఆలోచనలు అల్లితే సహించేది లేదన్నారు.అబివృద్ధి ఎవరి డబ్బులతో చేయడంలేదని ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి కార్యక్రమలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకొని నాయకులు మాట్లాడలన్నారు.జిల్లా అయితే మరింత అభివృద్ధి జరుగుతుందని మాట్లాడుతున్న వ్యక్తులు
అమరావతి రాజధానిని మూడు రాజధానులు చేస్తుంటే ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు.అమరావతి రాజధానిగా ఉంటే సూర్యలంక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.రాష్టానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని,రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను,శాసనసభ్యులు ను ఏకగ్రీవలుగా ఎన్నుకుంటే ప్రత్యేక హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా త్వరలలో జరగానున్న మున్సిపల్ ఎన్నికలలో పట్టణంలోని 34 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్నరని చెప్పారు.ఈ కార్యక్రమంలో దోనెపూడి దేవరాజ్,రవి,శ్రీవల్లి,అబుల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement