Friday, June 25, 2021

హోం మంత్రి నియోజకవర్గంలో సిఎం సహాయనిధి కింద రూ.94.87 లక్షలు మంజూరు

గుంటూరు – ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను రాష్ట్ర హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత శనివారం లబ్దిదారులకు అందజేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 132 మందికి సి ఏం సహాయనిధి క్రింద 94 లక్షల 87 వేల రూపాయలు మంజూరయ్యాయి. గుంటూరు రూరల్ మండల పరిధిలో 50 లక్షల 16 వేల రూపాయలు, ప్రత్తిపాడు మండలం లో 15 లక్షల 55 వేలు, పెదనందిపాడు మండలంలో 10 లక్షల 47 వేలు, కాకుమాను మండలంలో 9 లక్షల 83 వేలు, వట్టిచెరుకూరు మండలంలో 8 లక్షల 86 వేల రూపాయలు మంజూరయినట్టు హోం మంత్రి సుచరిత వెల్లడించారు. లబ్దిదారులందరికి శనివారం గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సుచరిత చెక్కులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News