Saturday, April 20, 2024

ప‌ల్లెలో న‌యం – ప‌ట్నాల‌లోనే భ‌యం

అమరావతి, : కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం అత్యధి కంగా పట్టణ ప్రాంతాల్లోనే కనిపిస్తోంది. ప్రత్యేకించి యువతే ఎక్కువ శాతం కరోనా బారిన పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోవిడ్‌ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరగడం తది తర కారణాలు వెరసి.. సెకండ్‌ వేవ్‌ పట్టణ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఇదే సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కేసుల శాతం చాలా తక్కు వగా నమోదవుతుండడాన్ని బట్టి చూస్తుంటే పల్లెవాసులు కరోనా దరిచేర కుండా పాత కట్టుబాట్లను నూటికి నూరు శాతం ఆచరిస్తున్నారనేది స్పష్ట ంగా అర్థమవుతోంది. ఫలితంగానే పట్టణ ప్రాంతాల్లో సుమారు 85 శాతం కరోనా కేసులు నమోదవుతుండగా.. పల్లె ప్రాంతాల్లో కేవలం 10 నుంచి 15 శాతం మంది మాత్రమే కరోనా బారిన పడు తున్నారు. దీంతో అనేక మంది పట్టణ వాసులు స్వగ్రామాల వైపు మొగ్గుచూపు తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ మహానగరాల్లో ఉద్యోగం, వ్యాపార రీత్యా వలస వెళ్లిన కుటుంబాలన్నీ పల్లెబాట పడుతున్నాయి. అయినా కూడా గ్రామీణ ప్రాంతా ల్లో సెకండ్‌ వేవ్‌లో చాలా తక్కువ శాతం కేసులు నమోద వుతున్నాయి. అదేవిధంగా సముద్రతీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో కూడా కట్టుబాట్లను క్రమం తప్ప కుండా అమలు జరుపుతున్నారు. ఫలితంగానే సుమారు 1090 మత్స్యకార గ్రామాల్లో 3 నుంచి 5 శాతం మాత్రమే ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి చూస్తుంటే కరోనా వంటి విపత్కర సమయంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాల కంటే మారుమూల గ్రామాల్లోనే ప్రజల ఆరోగ్యాలకు భద్రత లభిస్తుందన్నది స్పష్ట ంగా అర్థమవుతోంది.
సెకండ్‌ వేవ్‌లో 85 శాతం పైగా..నగరాల్లోనే కేసులు
ఏప్రిల్‌ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ కోవిడ్‌ వైద్యశాలల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల్లో 85 శాతం వరకు పట్టణ ప్రాంతాలకు చెందిన వారే. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలోని మహానగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూ రులలో కోవిడ్‌ నిబంధనలను పాటించాలని పదేపదే ఉన్నతాధి కారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. అయినా పట్టణ
ప్రజల్లో ఎటు వంటి మార్పు లేదు. 50 శాతం మందికి పైగా మాస్కులు లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. మరో 30 శాతం మంది సామాజిక దూరాన్ని పూర్తిగా వదిలేశారు. గుంపులు గుంపు లుగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఫలితంగానే సెకండ్‌ వేవ్‌ కరోనా పట్టణ ప్రాంతాల్లోనే పంజా విసురుతోంది. ఇప్పటి వరకు నమోదైన గణాంకాలను బట్టి చూస్తుంటే 80 నుంచి 85 శాతం వరకు పట్టణ ప్రాంతాల్లోనే కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా కోవిడ్‌తో మృతి చెందేవారి సంఖ్య కూడా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే కనిపిస్తోంది.
నగరాలతో పోలిస్తే.. పల్లెల్లోనే ప్రశాంతం
రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో వంద కు పైగా పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. మరికొన్ని మినీ పట్టణాలు కూడా ఉన్నాయి. అయితే సంఖ్యాప రంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది నివసిస్తుంటారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో జీవించే ప్రజలు దాదాపుగా సమానంగానే ఉన్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, దినచర్యలో భాగంగా ప్రతి ఒక్కరూ పగలంతా బయట ప్రాంతాల్లోనే పనిచేయాల్సి రావడం తదితర కారణాలు వెరసి నగరాల్లో కరోనా పంజా విసురుతోంది. అందుకు పూర్తి భిన్నంగా పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ప్రశాంత వాతావరణం దర్శనమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రజలు కరోనాతో హడలిపోతుంటే పల్లె ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను గౌరవిస్తూ తమ ఆరోగ్యాలను భద్రంగా చూసుకుంటున్నారు. ఫలితంగానే పట్టణ వాతావరణం కంటే ప్రస్తుత తరుణంలో పల్లె వాతావరణమే ప్రశాంతంగా ఉంది. దీంతో అనేక మంది స్వగ్రామాల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహ మ్మారి తగ్గుముఖం పట్టేవరకు పట్టణాలు వదిలి పల్లె లకు వెళ్లాలని యోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement