డా.బీఆర్ అంబేద్కర్ తన హీరో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ… ఒక మార్పు కోసం తాను ప్రయత్నిస్తున్నానన్నారు. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాటిచ్చానన్నారు. 2019 ఓటమి తర్వాత తాను పార్టీ వదిలిపెట్టి పోతానని అనుకున్నారన్నారు. తన అపరిమిత ధనం లేదు.. ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉందన్నారు. వెంటనే అధికారం చేపట్టాలనేది తన ఆలోచన కాదన్నారు. పాలసీ పరంగా నిర్ణయాలుండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్దతిచ్చానన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement