Friday, March 29, 2024

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు – మాజీ మంత్రి ఆలపాటి

కొల్లిపర, : గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించటం శుభ పరిణామమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని దావులూరు అడ్డరోడ్డు సెంటర్లో ఏర్పాటుచేసిన నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండల బీసీ సంఘం అధ్యక్షులు మోర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రోజా ఆసుపత్రిని డాక్టర్ కొమ్మారెడ్డి శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పై పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందని ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన డాక్టర్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించడం హర్షణీయమన్నారు. ఇకపై మండల ప్రజలు వైద్య సేవల కోసం గుంటూరు, తెనాలి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణం లో కీలక పాత్ర పోషించిన మోర్ల శ్రీనివాసరావును పలువురు నేతలు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కేశన శంకర్ రావు, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు భీమవరపు చిన్న కోటిరెడ్డి, కంచర్ల అమృత రాజు, కొల్లి కోటిరెడ్డి, డేవిడ్, డాక్టర్ రోజా రాణి, డాక్టర్ ప్రకాష్ బాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement