Saturday, April 20, 2024

బైకుల‌ చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్.. 8 ల‌క్ష‌ల విలువైన 13 బైకులు స్వాధీనం

చేబ్రోలు, (ప్రభ న్యూస్): పలు ద్విచక్ర వాహనాలు చోరీ కేసుల్లో నిందితులను గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్ విలేక‌రుల‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. తెనాలి మండలం జాగర్లమూడికి చెందిన అహ్మద్ అబ్దుల్ రషీద్, చేబ్రోలు మండలం శలపాడు గ్రామానికి చెందిన తాత సుధీర్ కుమార్ కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నారు. అబ్దుల్ రషీద్ పై తెనాలి పట్టణంలోని పోలీస్ స్టేషన్‌, కొల్లిపర, మరికొన్ని స్టేషన్లలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులున్నాయి. అదేవిధంగా తాత సుధీర్ కుమార్ పై కూడా గతంలో గంజాయి కేసు ఉన్నది.

శలపాడు గ్రామానికి చెందిన పటాన్ ఖాజా గత నెల 25వ తేదీన తన ద్విచక్ర వాహనాన్నిఇంటిముందు నిలిపాడు. తెల్లవారిన తర్వాత తన ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేబ్రోలు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై చేబ్రోలు, తెనాలి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను ప‌ట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 8 లక్షల విలువచేసే 13ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుక‌న్న‌ట్టు డీఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement