Saturday, April 20, 2024

పంచాయితీల‌కు నిధుల గండం..

ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రత్యేక కథనం…

నెలాఖరులోగా ఖర్చు పెట్టాల్సిందే
14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే ప్రమాదం
మల్లగుల్లాలు పడుతున్న పంచాయతీలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
అమరావతి, అసలే పంచాయతీలకు ఆదాయం అంతంత మాత్రం గానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు. కేవలం ఆర్థిక సంఘం నిధులే పెద్ద దిక్కుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూ రయ్యాయి. ఆ మొత్తాన్ని ఈ నెలాఖరుకు వెచ్చించాల్సి ఉంటు-ంది. లేదంటే నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు.. సాధా రణంగా ఆర్థిక సంఘం నిధులు ఐదేళ్ల పాటు- మంజూరవు తుంటాయి. ప్రతి ఏటా రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేస్తుంటారు. ఆర్థిక సంఘం అమలులో ఉన్న సమయంలో ఎప్పుడైనా ఖర్చు పెట్టు-కునే అవకాశం ఉంటు-ంది. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం అమలు జరిగి మార్చి నాటికి 5 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. దాంతో నిధులు ఖర్చు పెట్టు-కోవడానికి ఇదే ఆఖరు నెల. ఈలోగా వెచ్చించక పోతే నిధులు మురిగిపోతాయి. మరోవైపు 15వ ఆర్థిక సంఘం అమలులోకి రానుంది. రాష్ట్రంలోని 12వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ.2200 కోట్లకు పైగా నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. రహదారులు, తాగు నీటి సౌకర్యా లు, పారిశుధ్య నిర్వహణకోసం, డ్రెయినేజీ వ్యవస్థ అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలి.
కరోనా సమయంలో ఒకేసారి నిధులు మంజూరయ్యాయి. అప్పట్లో వినియో గించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇటీ-వల పంచాయతీలకు ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చింది. దాంతో కొత్త పనులు చేపట్ట లేకపో యారు. నిధులు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. ఒక్కో మండలంలో కోట్ల రూపాయలు నిధులు అందుబాటు-లో ఉన్నా యి.దాంతో అధికారులు వాటిని వినియోగించుకోవ డానికి ఆపసోపాలు పడుతున్నారు. కనీసం -టె-ండర్‌లు పిలిచి పనులు ప్రారంభిస్తే నిధులు వినియోగంలోకి వచ్చినట్టే లెక్క. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఇప్పటికే ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పంచాయతీలు మరింత ఆర్థిక సంక్షౌభాన్ని ఎదుర్కోనున్నాయి. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులను మార్చిలోగా ఖర్చు పెట్టు-కోవడానికి అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. శాసన సభ్యులనుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. సకాలంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో అధికారులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు నిధులు వెచ్చించేలా కొన్ని మండలాల్లో చర్యలు తీసుకుంటు-న్నారు. రహదారులు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఏదైనా పనులు ప్రారంభమైతేనే నిధులు వినియోగం కానున్నాయి. లేదంటే కోట్ల రూపాయలు వృథా కానున్నాయి.
కేంద్రానికి లేఖ..
ఇదిలావుండగా 14 వ ఆర్థికసంఘ నిధులు ఈ నెలాఖరుకు ఖర్చు చేయని పరిస్థితుల్లో నిధులు మురిగిపోకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-23) బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఇప్పటివరకు నిధులకు సంభందించి ఎలాంటి స్పష్టత రానట్లు- తెలుస్తోంది.
సర్పంచ్‌లకు దక్కని అధికారాలు..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి సుమారు నెలరోజులు కావస్తున్నా వారికి అధికారం మాత్రం ఇంకా రాలేదు. రాష్ట్ర విభజనకు ముందు 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో జరిగిన గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల పదవీకాలం 2018 ఆగస్టు నెలతో ముగిసింది. దీంతో అప్పటి తేదేపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించక పోవడంతో పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే గత నెల పంచాయ తీలకు ఎన్నికలు నిర్వహించింది. అయినా గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతుండడంతో సర్పంచ్‌ లుగా గెలిచిన వారికి అధికారం ఇంకా చేజిక్కక పోవడంతో నిరుత్సాహంతో వున్నారు.
ఈ నెలాఖరుకు అధికారాలు..
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించని పంచాయతీలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. ఈ నెలాఖరుకు ఆ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలలో ప్రత్యేకాధికారులను తొలగించి సర్పంచ్‌ లకు అధికారాలు కట్టబెట్టనున్నట్లు- సమాచారం.
నజరానా కోసం ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌ల ఎదురు తెన్నులు..
ఏకగ్రీవ పంచాయతీల నజరాన కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ఏకగ్రీవంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను ఎన్నుకుంటే భారీగా నజరాన అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. రెండువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, రెండువేలు నుంచి ఐదు వేలున్న పంచాయతీలకు రూ. 10 లక్షలు, ఐదు వేల నుంచి పదివేల మంది జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15లక్షలు, పది వేలు దాటిన పంచాయతీలకు రూ. 20 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 12వేలకు పైగా
పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కాగా ప్రభుత్వ నిబంధనల మేరకు సుమారు 3వేల పంచాయతీలకు మాత్రమే ప్రోత్సాహకం వర్తించనుంది. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌ స్తానాలు ఏకగ్రీవమైనా వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నజరాన రూపంలో రూ. సుమారు 200 కోట్లు- రావాల్సి ఉంది. 2013లో జరిగిన ఎన్నికల్లో మైనర్‌ పంచాయతీకి రూ. 7లక్షలు, మేజర్‌ పంచాయతీకి రూ. 20 లక్షలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. అప్పట్లో అనేక మేజర్‌, మైనర్‌ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనప్పటికీ నగదు ప్రోత్సాహకం ఇవ్వలేదని పలుసార్లు సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. తాజాగా ఎన్ని-కై-న సర్పంచ్‌లు ప్రభుత్వం ప్రకటించిన నజరాను విడుదల చేయాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement