Friday, March 29, 2024

తుపాకీ మిస్ ఫైర్.. హోం గార్డ్ భార్య మృతి

విజయవాడలో తుపాకీ సరదా ఒకరి ప్రాణాలు బలి తీసుకుంది. హోంగార్డ్ తన భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తుండగా మిస్ ఫైర్ కావడంతో సూర్యరత్నప్రభ మృతి చెందింది. గన్ మిస్ ఫైర్ అయి గుండెలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే రత్నప్రభ ప్రాణాలు విడించింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్న హోంగార్డ్ వినోద్.. మూడ్రోజుల క్రితం క్యాంప్‌కు వెళ్లాడు. అనంతపురం వెళ్లిన ఏఎస్పీ తుపాకీని హోంగార్డు తీసుకుని తన భార్యకు చూపిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని హోంగార్డ్‎ను విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement