Monday, April 15, 2024

ఎపిలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో క్రమేణా తుపాకీ సంస్కృతి పెరుగుతోంది. ఫ్యాక్షన్‌ మూలాలు ఉన్న జిల్లాల్లో గన్‌ కల్చర్‌ మరింత బలపడటం ఆందోళన కలిగి స్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్‌ మాఫియా కార్యకలాపాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో పోలీసుశాఖకు సవాల్‌గా మారింది. విశాఖ, గోదావరి జిల్లాల్లో సైతం ఇటీవల కాలంలో తుపాకీ తూటాలు పేలడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మద్యం మాఫియా, భూ దందా, ఆర్ధిక లావాదేవీలు వంటి కార్యకలాపాల్లో తలెత్తే వివాదాలను పురస్కరించుకుని జరుగుతున్న దాడుల్లో తుపాకీ ప్రధానంగా మారింది. ఇక రాజకీయ కక్షల నేపధ్యం, వ్యక్తిగతం వంటి అంశాల్లో కూడా గన్‌ స్వైర విహారం చేస్తుండటం గమనార్హం. హత్యలు, ఆత్మహత్యలు, బెదిరింపులు వీటన్నింటికీ ఒకే ఆయుధం తుపాకీ. ఇలా నానాటికీ గన్‌ వినియోగం పెరిగిపోవడంతో ఆయా ఘటనల్లో నిందితులను అరెస్టు చేసే పోలీసులు తుపాకీ మూలాలను మాత్రం చేధించలేకపోవతున్నారు. బీహార్‌ , ఉత్తర ప్రదేశ్‌, రాజస్ధాన్‌, ఢిల్లీ, హరియాణా, మధ్య ప్రదేశ్‌ నుంచి కొనుగోలు చేసుకుంటున్న క్రమంలో విదేశీ గన్‌లను కూడా దిగుమతి చేసుకోవడం మరింత ఆందోళనకు దారి తీస్తోంది. కొద్దిరోజుల క్రితమే అనంతపురం పోలీసులు అక్రమ ఆయుధాల మాఫియాను పట్టుకున్నారు. ఇక తాజాగా కడప జిల్లా పులివెందుల ఘటన మరోసారి రాష్ట్రంలో అలజడి రేపింది. కాల్పులకు పాల్పడిన భరత్‌కుమార్‌ యాదవ్‌ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌కు బంధువు కావడం మరో సంచలనంగా మారింది. పైగా వివేకా కేసులో భరత్‌ కుమార్‌ను గతంలో సీబిఐ విచారించింది కూడా. అయితే తాజా ఘటనలో దిలీప్‌ మృతి చెందగా.. బాషా తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్ధి క లావాదేవీలే కారణమైనా గన్‌కల్చర్‌ వెళ్ళూనుకుపోయిందనడానికే ఇదే నిదర్శనమనే ఆందోళన వ్యక్తమవుతోంది . ఇది ముదరకుండానే పెకి లించాల్సి అవశ్యకతను గుర్తు చేస్తున్నారు.

నకిలీ నోట్ల తీగ లాగితే దొరికిన తుపాకీ..
గత ఏడాది డిసెంబర్‌లో నకిలీ నోట్ల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేయగా విచారణలో అక్రమ ఆయుధాల గుట్టు రట్టయింది. మధ్య ప్రదేశ్‌ కేంద్రంగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసిన తుపాకులు గత కొంతకాలంగా రాష్ట్రంలో విక్రయాలు, చలామణి చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. కర్నాటక, గోవా రాయదుర్గం, బళ్ళారి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి 18 తుపాకులు, 95 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద గన్‌ మాఫియా వ్యవహారం బయటపడటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

నెల్లూరులో ఎన్నడూ లేని ఉలికిపాటు..
నెల్లూరులో మరో ఘటన రాష్ట్ర ప్రజలు, పోలీసులను ఉలికిపాటుకు గురి చేసింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో సురేష్‌ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పెళ్ళికి అంగీకరించలేదని ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు. అదే గన్‌తో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తుపాకీ యుఎస్‌ఏ నుంచి దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

బెజవాడకు కొత్తేమీ కాద నేలా..
విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో తుపాకీ పేలడం కొత్తేమీ కాదు.. వన్‌టౌన్‌లో పంతులు హత్య దగ్గర నుంచి పొట్లూరి రామకృష్ణ, కాట్రగడ్డ బాబుపై దాడి, వంగవీటి శంతన్‌పై కాల్పులు ఉదంతం ఇలా చెప్పుకోదగిన సంచలన ఘటన లే ఉన్నాయి. బీహార్‌ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు ప్రాధమికంగా వెల్లడైనా మూలాలు కనుగొనడంలో పోలీసుల వైఫల్యం బయటపడుతూనే ఉంది. ఈక్రమంలోనే సాక్షాత్తు పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో పని చేసే మహేష్‌ అనే ఉద్యోగిని నున్న బైపాస్‌ రోడ్డులో కొందరు తుపాకీతో కాలి ్చ చంపారు. నిందిత ులను అరెస్టు చేసినా గన్‌ ఎలా వచ్చిందనేది మాత్రం వదిలేశారు.

- Advertisement -

గోదారికి పాకిన బుల్లెట్‌ సంస్కృతి..
ఇక తుపాకీ మోత అంటేనే ఎరుగని గోదావరి జిల్లాలకు సైతం ఈ గన్‌ కల్చర్‌ క్రమేణా పాకింది. మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఓ ఫైనాన్షియర్‌పై దుండగులు కాల్పులకు పాల్పడటం జిల్లాలో భయ భ్రాంతులకు గురి చేసింది. అదేవిధంగా రాజమండ్రిలో గన్‌తో పట్టుబడిన వ్యక్తులను విచారించగా మూలాలు విజయనగరంలో బయటపడ్డాయి. రాజమండ్రికి చెందిన హరి సూర్య, సత్యనారాయణ అనే వ్యక్తుల ప్రయాణిస్తున్న వాహనాన్ని అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద యుఎస్‌ఏకు చెందిన 9ఎంఎం పిస్టల్‌, ఆరు బులె ్లట్లు దొరికాయి. నిందితులను విచారించగా విజయనగరం జిల్లాకు చెందిన రియల్టర్‌ బొత్స మోహన్‌ అనే వ్యక్తి అమ్మినట్లు వెల్లడైంది. అతన్ని అదుపులోకి తీసుకోగా మరో తుపాకీ దొరికింది. ఇక కాకినాడలో ఓ పోలీసు అధికారి కుమారుడు సర్వీసు రివాల్వర్‌తో హల్‌ఛల్‌ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు అప్పట్లో విచారణకు ఆదేశించారు.

పల్నాడులో అదే పట్టు..
కొన్ని నెలల క్రితం పల్నాడు జిల్లా పోలీసులు ఓ మద్యం సిండికేట్‌ను వివాదాన్ని పురస్కరించుకుని కొందరిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద తుపాకులు బయట పడ్డాయి. గడ్డి వాములో దాచిపెటి ్టన రెండు తుపాకులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు గాని, ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో మాత్రం విచారణ ముందుకు సాగలేదు. ఇక కొద్ది నెలల క్రితం రొంపిచర్ల మండలం టీడీపీ నాయకుడు బాలకోటి రెడ్డిపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టిం చింది . దుండగుడు వినియోగించిన తుపాకీ రాజస్ధాన్‌ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement